11 వేల బాలికలు,మహిళలతో లిమ్కా రికార్డు

by Aamani |
11 వేల బాలికలు,మహిళలతో లిమ్కా రికార్డు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బేటి పడావో బేటీ బచావో స్పూర్తితో న్యాయ సేవ అధికార సంస్థ బాలికల,మహిళల ఆత్మరక్షణ హక్కుల కోసం తైక్వాండో శిక్షనిప్పుస్తున్నదని సంస్థ రాష్ట్ర సభ్య కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల మైదానంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ పోలీసు,కార్యనిర్వాహక శాఖల సహకారంతో బాలికల కోసం నిర్వహించిన తైక్వాండో శిక్షణ ప్రదర్శనలో ఆయన ప్రధానోపన్యాసం చేశారు. తైక్వాండో నేర్చుకున్న నిజామాబాద్ జిల్లా బాలికలు మిగతా జిల్లాల బాలికలకు ఆదర్శంగా నిలుస్తారని ఆయన అన్నారు. పదకొండు వేల మంది బాల బాలికలు,మరికొంత మంది మహిళలు ఒక దగ్గరకు చేరడం ఒక ఎత్తయితే అందరూ కలిసి ఉమ్మడిగా తైక్వాండో ప్రదర్శించడం మరొక ఎత్తుగా ఆయన అభివర్ణించారు.

అసాంఘిక వ్యక్తుల అసాధారణ చర్యలను ఎదుర్కోవడానికి తైక్వాండో అత్యుత్తమ సాధనమని జడ్జి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మార్చి 8 న నిర్వహించుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా నేటి తైక్వాండో ఒక చిరస్మరణీయ చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పదకొండు వేల మంది ఒక్కక్కరు పదిమందికి తైక్వాండో శిక్షణనిచ్చి విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన కోరారు.భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు నేటి కార్యక్రమం దిక్సూచి గా నిలవాలని ఆయన అభిలాషించారు.దేశ చరిత్రలో ఇంత పెద్ద శిక్షణ కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పడం న్యాయసేవా సంస్థకు ,నిజామాబాద్ జిల్లా కు గర్వకారణంగా ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల మాట్లాడుతూ బాలికల ఆత్మరక్షణ కోసం తైక్వాండో ప్రధాన భూమిక పోషిస్తుందని తెలిపారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు,స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల యాజమాన్యం సహాయ,సహకారాలు మరచిపోలేమని అన్నారు. జిజి కళాశాలలో నిర్వహించిన తైక్వాండో ప్రదర్శన బాలికలే అంకితమని అన్నారు.ఆత్మరక్షణతో ఆత్మగౌరవం పెరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మె శ్వర్ సింగేవార్ తెలిపారు. బాలికల,మహిళల రక్షణకు రక్షణ కవచంగా తైక్వాండో ఉపయోగ పడుతుందని ఆయన తెలిపారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు హైదరాబాద్ కార్యాలయ ప్రతినిధి వసుధ అశోక్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు పత్రాన్ని న్యాయ సేవ అధికార సంస్థ రాష్ట్ర సభ్య కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి,జిల్లా జడ్జి ,సంస్థ చైర్ పర్సన్ సునీత లకు అందజేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి,సీనియర్ సివిల్ జడ్జీలు శ్రీకాంత్ బాబు,అజయ్ కుమార్,పద్మావతి, జూనియర్ సివిల్ జడ్జీలు కుష్భు,గోపికృష్ణ,దీప్తి వేముల,పూజిత,సాయి శివ,ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్,జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్ ,నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నూతన శోభను సంతరించుకున్న జీజీ కళాశాల గ్రౌండ్...

పదకొండు వేల మంది బాలికలు,మహిళలతో , వారి తైక్వాండో ప్రదర్శనతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల గ్రౌండ్ నూతన శోభను సంతరించుకుంది. తైక్వాండో మాస్టర్ ట్రైనర్ మనోజ్ సూచనలను అనుసరించిన బాలికలు అద్భుతమైన ప్రదర్శననిచ్చారు.11 వేల మందితో ఒక రికార్డు కు వేదికగా నిలిచింది.రాష్ట్ర, జిల్లా న్యాయసేవా అధికార సంస్థల ప్రస్థాన చరిత్ర పుటలలో తన పేరను నమోదు చేసుకున్నది.

Advertisement

Next Story

Most Viewed