మోడీ నాయకత్వంలో జహీరాబాద్ ను మరింత అభివృద్ధి చేసుకుందాం

by Sridhar Babu |
మోడీ నాయకత్వంలో జహీరాబాద్ ను మరింత అభివృద్ధి చేసుకుందాం
X

దిశ,నిజాంసాగర్ : మోడీ నాయకత్వంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మరింత అభివృద్ధి చేసుకుందామని జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. ఆదివారం ఆయన జుక్కల్ నియోజకవర్గంలోని మహ్మద్ నగర్ మండల కేంద్రంలో ఐదు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు 50 మంది బీజేపీలో చేరారు. అదేవిదంగా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామానికి చెందిన 30 మంది మహిళలు ఎంపీ బీబీ పాటిల్ సమక్షంలో బీజేపీలో పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ప్రపంచం మొత్తం భారత్ వైపు చేసే విధంగా అభివృద్ధి చేశారు. మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్క కార్యకర్త గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేసి ఓటు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంను అభివృద్ధి చేశామని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి విద్యా, వైద్యం, రైల్వే, జాతీయ రహదారులను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అనంతరం మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గఫూర్ గ్రామంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ వసతి లేనందున తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన బీబీ పాటిల్ కేంద్ర టెలికాం శాఖ మంత్రితో మాట్లాడి సెల్ ఫోన్ సిగ్నల్స్ పునరుద్దరణ చేపడతానని హామీ నిచ్చారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార,ప్రధాన కార్యదర్శి రాము సెట్, జగదీష్,మండల పార్టీ అధ్యక్షుడు మేకల నరేష్, మహ్మద్ నగర్ మండల అధ్యక్షులు పోలీస్ రాజు, ఒంటరి నారాయణరెడ్డి, కుమ్మరి బాలు, శేఖర్, మధు, బాల్ రెడ్డి, కూర్మ మల్లేశం, అశోక్ రాజ్, లకావత్ గోపాల్, మోహన్ రెడ్డి ఉపాధ్యక్షులు పుప్పాల విఠల్,ప్రధాన కార్యదర్శులు కూర్మ, యాదయ్య,సతీష్ కుషన్న,మహిళా మోర్చా అధ్యక్షురాలు అంజవ్వ కిసాన్ మోర్చా అధ్యక్షులు పండరి, ఓబిసి మోర్చా అధ్యక్షులు నాగరాజ్, యువ మోర్చా అధ్యక్షులు సంతోష్,ఎస్టీ మోర్చా అధ్యక్షులు సచిన్, వివిధ గ్రామ బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story