జెన్కో పరిధిలోని భూమి కబ్జా!?.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర సివిల్ డైరెక్టర్

by Naresh |
జెన్కో పరిధిలోని భూమి కబ్జా!?.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర సివిల్ డైరెక్టర్
X

దిశ,నిజాంసాగర్: మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోగల హెడ్సెలుస్ జలవిద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర సివిల్ డైరెక్టర్ అజయ్ సందర్శించి పనులను పర్యవేక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జెన్కో పరిధిలో గతంలో 42 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ప్రస్తుతం భూ పరిమాణం తగ్గిపోవడంతో కబ్జాకు గురైనట్లు సమాచారం తెలిసినట్లు తెలిపారు.

ప్రభుత్వ భూమి కబ్జా చేసినవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, తమ ఆధీనంలోకి తీసుకొని హద్దులు ఏర్పాటు చేసుకుంటామని ఆయన తెలిపారు. గత 2022 నవంబర్ మాసంలో జల విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు మరమ్మతులు కావడంతో ఇతర దేశాల నుంచి పనిముట్లను తెప్పించి రూ.12.5 కోట్లతో మరమ్మత్తులు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ సంవత్సరం డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసంలో పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రెండు యూనిట్ల పనులు పూర్తయ్యాక యూనిట్ నుంచి ఐదు మెగావాట్ల విద్యుత్ చొప్పున 10 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని, ఈ పనిముట్ల వ్యవధి కాలం ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేస్తాయని తెలిపారు.

ముందుగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట సివిల్స్ సిఈటి. నారాయణ, ఎస్ఈ సివిల్ హైడర్ శ్రీధర్, సివిల్ ఈఈ పాండు రంగారెడ్డి, ఓఎన్ఎమ్ సిఈ రమేష్ బాబు, ఎస్ఈ పీ. శ్రీనివాస్,డీవో జె.శ్రీనివాస్,ఏఈఈ సురేష్ కుమార్,ఏడీఈ శ్రీకాంత్, ఆర్.ఏ యం ఏడీఈ రవి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story