పలు చట్టాలపై అవగాహన

by Sridhar Babu |
పలు చట్టాలపై అవగాహన
X

దిశ, నిజామాబాద్ సిటీ : జిల్లా నాయసేవాధికార సంస్థ నిజామాబాద్ ఆధ్యర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో పిల్లలపై లైంగిక వేధింపులు, ఫోక్సో, ఎన్ డీ పీ ఎస్ చట్టాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అథితిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కలెక్టర్ కిరణ్ కుమార్, సీపీ కల్మేశ్వర్ సింగన్వార్, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ సెక్రటరి పి. పద్మావతి పాల్గొన్నారు. మొదటి సెషన్ లో

పిల్లలపై లైంగిక వేధింపులు, ఫోక్సో చట్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణను జిల్లా ప్రధానన్యాయమూర్తి సునీత కుంచాల క్షుణ్ణంగా వివరించారు. రెండవ సెషన్ లో ఎన్ డీ పీఎస్ చట్టంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది గోపాల కృష్ణ గోఖలే కార్యక్రమంలో హాజరై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్ కుష్బూ ఉపాధ్యాయ, దీప్తి, గోపికృష్ణ, శ్రీనివాస్, ట్రైనీ ఐపీఎస్ చైతన్య రెడ్డి, ఏ ఎస్ పీ శిషాద్రిని రెడ్డి, న్యాయశాఖ, పోలీసుశాఖ, చైల్డ్ వెల్ఫేర్, సఖి సెంటర్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed