ప్రజలే నా బలం, బలగం..Minister Vemula Prashanth Reddy

by Sumithra |   ( Updated:2023-08-22 20:20:31.0  )
ప్రజలే నా బలం, బలగం..Minister Vemula Prashanth Reddy
X

దిశ, భీమ్‌గల్ : ప్రజలే నా బలం బలగం అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ప్రకటించిన తర్వాత మొదటి సారి బాల్కొండ నియోజకవర్గానికి వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు గజమాలతో అఖండ స్వాగతం పలికారు. పేర్కిట్, లక్కోరా, వేల్పూర్, భీమ్‌గల్, కమ్మర్ పల్లి, మోర్తాడ్ మీదుగా దారి పొడవునా అడుగడుగునా అభిమానులు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి వరుసగా మూడో సారి పార్టీ టికెట్ కేటాయించినందుకు సీఎం కేసిఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి అంబేద్కర్ విగ్రహానికి, వేల్పూర్ ఎక్స్ రోడ్ లో రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించనున్నారని అన్నారు. తనపై ఎంతో నమ్మకంతో మరోసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నిరాజనం చూస్తుంటే సీఎం కేసీఆర్ కు తనపై ఉన్న నమ్మకం ఏంటో అర్థమవుతుందని తెలిపారు. డబ్బుతో ఈ ప్రేమను కొనలేరు.

సీఎం కేసీఆర్ ఒక్కరు ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ ఇతర దుష్టశక్తులు మరోవైపు అని చెప్పారు. ఎవరిని ప్రయత్నాలు చేసినా ఈసారి కూడా బీఆర్ఎస్ దే ఘనవిజయం అని తెలిపారు. 19వేల కోట్లతో రుణమాఫీ చేసిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. మ్యానిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేశారన్నారు. అందుకే సీఎం కేసిఆర్ పై ప్రజలకు ప్రగాఢ విశ్వాసం అని అన్నారు. ఇక ఈ మధ్యన ఓటమి భయంతో నాపై కొంతమంది దృష్ప్రాచారం చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్న అని చెప్పారు. వేల కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. ప్రజల ఆశీర్వాదంతో ఈ అభివృద్ధిని కొనసాగిస్తానని తెలిపారు. అపూర్వ స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలకు, తన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ లు అందజేత..

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఇటీవల లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని అన్ని గ్రామాల యువతి యువకులందరికి మోర్తాడ్ గ్రామ ఆర్‌.ఎన్.బీ ఫంక్షన్ హాల్ లో సుమారు 1092 మంది యువతి యువకులకు లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.

Advertisement

Next Story