- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడిషనల్ కలెక్టర్ వాహనం 8 చలాన్లు క్లియర్..
దిశ, కామారెడ్డి రూరల్ : 'అధికారుల చలాన్లు కట్టించండి' శీర్షికతో జిల్లా అడిషనల్ కలెక్టర్ వాహనంపై ఉన్న పెండింగ్ చాలాన్లపై శుక్రవారం దిశ డైనమిక్, వెబ్ న్యూస్ లో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. శనివారం సంబంధిత అధికారికి చెందిన టీఎస్ 09 ఎఫ్ఆర్ 8218 నంబర్ గల వాహనంపై ఉన్న 8 చలాన్లను అధికారులు చెల్లించారు. 2021 సెప్టెంబర్ నుంచి ఈ నెల 9 వరకు మొత్తం 10 పెండింగ్ చాలాన్లకు కలిపి 10,450 రూపాయల ఫైన్ పోలీసులు విధించారు. అయితే ఇందులో గత సంవత్సరం వరకు ఉన్న మొత్తం చలాన్లను చెల్లించిన అధికారులు ఈ సంవత్సరంలో పడిన చలాన్లు మాత్రం చెల్లించలేదు.
ఈ సంవత్సరం జనవరి 15 న నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి హైవే, సదాశివనగర్ మండలం మల్లుపేట వద్ద ఓవర్ స్పీడ్ కు సంబంధించి వెయ్యి రూపాయల చొప్పున 2 వేల ఫైన్ తో పాటు మీసేవ చార్జీలు కలువుకుని మొత్తం 2070 రూపాయలు ఫైన్ పడింది. 10 పెండింగ్ చలాన్లలో 8 క్లియర్ చేసిన అధికారులు జనవరి, ఫిబ్రవరిలో ఉన్న రెండు చలాన్లు మాత్రం పెండింగులో ఉంచడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే పత్రికల్లో వార్త వస్తే తప్ప అధికారులు స్పందించి ఫైన్లు కట్టే పరిస్థితి లేదని సామాన్య ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.