- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేఎన్టీయూ ఫలితాల్లో కాకతీయ మహిళా కళాశాల విద్యార్థిని ఫస్ట్..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని కాకతీయ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని అనుగు దేవిక జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్, రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ విద్యార్థిని దేవికను రెండు బంగారు పతకాలతో సన్మానించి సత్కరించారు. మంగళవారం కాకతీయ విద్యాసంస్థలో చైర్ పర్సన్ సీహెచ్.విజయలక్ష్మీ అనుగు దేవికను ఘనంగా సన్మానించి సత్కరించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సీహెచ్.రజనీకాంత్ మాట్లాడుతూ అనుగుదేవిక మొదటి సంవత్సరం నుంచి చురుకైన విద్యార్థినిగా పట్టుదలతో చదివి చివరి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ విభాగంలో చదువుతునే ఏడు ఎంఎన్ సీ కంపెనీలలో ఉద్యోగం సాధించడం కళాశాలకు గర్వకారణమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.సెల్వకుమార్ మాట్లాడుతూ దేవిక నిరంతర శ్రమ, అధ్యాపకుల ప్రోత్సహంతో జేఎన్టీయూ పరిధిలో మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. దేవికను స్పూర్తిగా తీసుకుని విద్యార్థినిలు ఉన్నత స్థానాలకు ఎదుగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సాయిరెడ్డి, హెచ్ వోడిలు నాగరాణి, మహేంధర్, మహిపాల్, అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.