నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావు

by Sridhar Babu |
నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియమితులయ్యారు. కొల్లాపూర్ శాసనసభ్యుడిగా, సీనియర్ నాయకుడిగా ఉన్న జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాత్రమే ఇన్చార్జి మంత్రుల నియామకాలు జరిగాయి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో నలుగురు శాసనసభ్యులు

గెలిచినా ఎవరికి కూడా మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల కోసం నిజామాబాద్ పార్లమెంటుకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని, జహీరాబాద్ కు మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. రెండో విడత మంత్రివర్గ విస్తరణ పై నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి వర్గం లో పదవులను ఆశిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు ముందే రాష్ట్రంలో ప్రజా పాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో అన్ని జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించింది. ఈ నేపథ్యంలోనే జూపల్లి కృష్ణారావుకు జిల్లా ఇన్చార్జి మంత్రి పదవి దక్కింది.

Advertisement

Next Story