జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ కు మంత్రి పదవి ఇవ్వాలి

by Sridhar Babu |
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ కు మంత్రి పదవి ఇవ్వాలి
X

దిశ, జుక్కల్ : జుక్కల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కు మంత్రి పదవి ఇవ్వలేదని, తోట లక్ష్మీకాంత్​కు మంత్రి పదవి ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. బుధవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించి జుక్కల్​ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు. మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పెద్ద ఏడికి సర్పంచ్ ఆసుపత్ వార్ వినోద్ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు, నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తి లక్ష్మీకాంత్​కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల జుక్కల్ నియోజకవర్గం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద గుల్ల సర్పంచ్ విఠల్ పాటేల్, మహ్మదాబాద్ సర్పంచ్ సాయిలు, మాజీ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్, గుండూర్ సర్పంచ్ దేవిదాస్, పడంపల్లి ఉప సర్పంచ్ లక్ష్మణ్, పెద్ద ఏడ్గి ఉప సర్పంచ్ ఖండేరావ్, హనుమారెడ్డి, వాడే లక్ష్మణ్, అరుణ్ ,సాయికర్ణ జాధవ్ , రెహ్మాన్,తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed