- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Air Pollution: దీపావళికి ముందు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో: దీపావళి పండుగకు ముందు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి వరకు టపాసులు పేల్చడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలపైనా నిషేధం విధించింది. ఈ నిషేధం పండుగ సీజన్‌కు ముందు రావడంతో, గాలి నాణ్యత క్షీణించకుండా ఉండే అవకాశం కన్పిస్తోంది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) తొలి దశ కింద వాయు కాలుష్య నిరోధక చర్యలు తీసుకునే ముందు పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో, దసరా మరుసటి రోజు ఆదివారం ఢిల్లీలోని గాలి నాణ్యత తీవ్రంగా తగ్గిపోయింది. దీని ఫలితంగా కేంద్రపాలిత ప్రాంతంలో వాయుకాలుష్యం పెరిగే అవకాశం ఉంది. అందుకే, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుంది.
పెరిగిన వాయుకాలుష్యం
ఇకపోతే, దేశరాజధాని రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. వాయుకాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. సోమవారం ఉదయం 9 గంటల వరకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 221గా నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లో 265, నోయిడాలో 243, గ్రేటర్ నోయిడాలో 228 గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక, గురుగ్రామ్‌లో 169, ఫరీదాబాద్‌లో 177గా గాలి నాణ్యత క్షీణించినట్లు చెప్పింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే కాలుష్యం లేనట్లు. అదే 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా.. 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత పూర్తిగా క్షిణించినట్లు అర్థం. అలాగే, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత దారుణంగా పడిపోయిందని.. AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని పరిగణిస్తారు.