మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు

by Sridhar Babu |   ( Updated:2023-11-12 11:50:19.0  )
మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు
X

దిశ, ఆర్మూర్ : సీఎం కేసీఆర్ జనరంజక పాలన ,అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు,నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర రోడ్లు ,భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బాల్కొండ నియోజకవర్గం లోని ఏర్గట్ల మండలం తొర్తి గ్రామం నుండి బీజేపీ సీనియర్ నాయకులు వేశాల సత్తయ్య, బీఎస్పీ మండల అధ్యక్షులు జంబుక రాజన్న, సీనియర్ కార్యదర్శి నాముడు రాజు, నిజామాబాద్ పీ వై ఎల్ జనరల్ సెక్రెటరీ

ఈర్గాల సృజన్ ,ఏర్గట్ల మండల పాస్టర్ల కార్యవర్గ సభ్యుడు జోసెఫ్, తొర్తి కాంగ్రెస్ కార్యకర్తలు ఈర్గాల నర్సయ్య, కొలిప్యాక అశోక్, మోర్తాడ్ గంగాధర్, బొజ్జు వినోద్, బొజ్జ రవిదాస్ ,బొజ్జ భీమ సేనుడు, బెల్లారి రాజేశ్వర్, బండారి నవీన్, శంకర్,భీంగల్ మండలం గోన్ గొప్పుల గ్రామం నుండి గొల్ల కుర్మ యువజన సంఘం సభ్యులు, వివేకానంద యూత్ సభ్యులు,ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామం నుండి కంఠం విఘ్నేశ్వర్ లు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరగా వారికి మంత్రి వేముల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఓట్లు వేయించాలని మంత్రి వేముల సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రి వేములకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు

బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని పలు గ్రామాల నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కుల సంఘాల ప్రతినిధులు స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం పత్రాలను ఆదివారం అందజేశారు. భీమ్గల్ మండలంలోని బాబా పూర్ కు చెందిన జమియత్ ఖురేషి సంఘం మైనారిటీ సభ్యులు, మోర్తాడు మండలంలోని వడ్డేట్ గోసంగి సంఘం, నెంబర్ వన్ వృద్ధుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానాల ప్రతులను సంఘ సభ్యులు మంత్రికి అందజేశారు. సంఘాల ప్రతినిధులు తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేయడం పట్ల మంత్రి వేముల హర్షం వెలిబుచ్చి, వారి అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed