తక్షణ ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం...

by Kalyani |
తక్షణ ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం...
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థినుల కోసం తక్షణ ప్రవేశాల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. ధనవేణి గురువారం తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. విద్యార్థినీలు పదవ తరగతి మెమో, ఇంటర్మీడియట్ మెమో, టి సి, కుల, ఆదాయ, బోనఫైడ్ ధ్రువీకరణ పత్రాలు వెంట తెచ్చుకొని కళాశాలకు రావాలన్నారు. ఎస్సీ సామాజిక విద్యార్థినులకు ప్రాధాన్యం ఉంటుందని కళాశాల ప్రిన్సిపాల్ జి. ధనవేణి తెలిపారు.

Next Story