వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

by Sridhar Babu |
వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అడిషనల్ డీఎంఈ ప్రొ.ఇందిరా తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు వైద్య కళాశాలలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందన్నారు. ఈ నెల 16న దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ఒర్జినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరుకావాలని తెలిపారు. ఇంటర్వ్యూలు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి వైద్య కళాశాలలోని ప్రిన్సిపాల్ చాంబర్ లో జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాల వెబ్ సైట్ www.gmcnzb.org ను సంప్రదించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed