- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగరంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. ఇబ్బందుల్లో ప్రజలు..
దిశ, నిజామాబాద్ సిటీ : మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. దశాబ్ది ఉత్సవాలు చేస్తూ ప్రభుత్వం ప్రగతిని చాటుతుంటే నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారు. నెల రోజులు గడుస్తున్నా తవ్విన పైప్ లైన్ ను పూడ్చక పోవడంతో అటు వెళ్లే ప్రయాణికులు, కాలనీకి వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీటి గుంతను మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ వర్క్స్ విభాగం వారు నెల రోజుల కిందట తవ్వి ఇలా వదిలేయడంతో పులాంగ్ నుండి వర్ని రోడ్ కు వెళ్ళే దారిలో చైతన్య హై స్కూల్ ముందు దేవిప్రియ మెడికల్ వద్ద యూటర్న్ లో ఈ గుంత ఉండటంతో పక్కన ఉన్న మురికి నీరు అందులోకి వెళ్తున్నాయి.
ఇందులో నిండిన మురికి నీరు ప్రతిరోజూ ఈ ప్రాంత వాసులకు సరఫరా అయ్యే త్రాగునీటిలో కలవడంతో నీరు కలుషితమవుతోందని అక్కడి కాలనీ వాసులు అంటున్నారు. మున్సిపల్ వాటర్ వర్క్స్ ఏఈ ఇనాయత్ కరీం, ఏరియా ఇంచార్జి నారాయణలకు అనేక సార్లు గల్లీ వాసులు వివరించినప్పటికి పెడచెవిన పెట్టడం గమనార్హం. నగర మేయర్, జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.