- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భర్త చివరి కోరిక తీర్చాలని వేడుకున్న భార్య..
దిశ, కామారెడ్డి రూరల్ : ఇతరులపై ఉన్న తమసొంత భూమిని తమ పేరిట మార్చాలని కోరుతూ తన భర్త ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని.. తన భర్త చివరి కోరికను తీర్చి తమకు న్యాయం చేయాలని బాధితుడి భార్య అధికారులను విజ్ఞప్తి చేసింది. కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామానికి చెందిన దుమాల మమత మాట్లాడుతూ తన స్వంత భూమి తమ పేరిట పట్టా కావడంలేదని భర్త మహేష్ పురుగుల మందు తాగి మృతి చెందగా, భర్త తండ్రి రాములు హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడన్నారు. ఈ భూమి కోసమే వారిద్దరూ మృతి చెందారని, ఇప్పటికైనా తమ కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో తామకు కూడా చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం మాజీ ఉపసర్పంచ్ రవి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మహేష్, తండ్రి రాములు ఆ భూమిలో మక్క, పత్తి పండించుకునేవారని తెలిపారు. గత 30 సంవత్సరాల క్రితం దుమల రాములు గ్రామానికి చెందిన వీరమల్లి శంకరయ్య దగ్గర కొన్నారని తెలిపారు. వారు కొన్న స్థలం వారి పేరు పైన కాకపోవడంతో తండ్రి రాములు, కొడుకు మహేష్ మృతి చెందాడన్నారు. మహేష్ కు భార్య ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారని తెలిపారు. బోరెడ్డి అంజల్ రెడ్డి పేరు పైన ఉందని భూమి తమ పేరుపై పట్టాకానందుకు మనస్థాపానికి గురై మహేష్ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూమిని మృతుల కుటుంబీకుల పేరు పై పట్టా చేయాలని కోరుతున్నారు.