- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చేసే పనిలో మెలకువలు నేర్చుకుంటే మంచి భవిష్యత్తు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
దిశ, కామారెడ్డి రూరల్ : చేసేపనిలో మెలకువలు, నైపుణ్యాలు నేర్చుకుంటే కార్మికులకు మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బాలుర పాఠశాలలో సోమవారం జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శిబిరాలు నిరంతరాయంగా కొనసాగుతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న భవన నిర్మాణ కార్మికులందరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు, డ్రైవర్లు, హోంగార్డులకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ప్రీమియాన్ని రాష్ట్ర కార్మిక శాఖ చెల్లిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
ప్రభుత్వ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు చెప్పారు. కార్మికులు తాము చేస్తున్న పనిని తక్కువ అంచనా వేసుకోవద్దని సూచించారు. కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా ఎదగవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లా కార్మిక సంక్షేమ భవన నిర్మాణానికి ఇల్చిపూర్ శివారులో ఎకరం స్థలాన్ని కేటాయించారని చెప్పారు. ఈ విధంగా పూర్తిస్థాయిలో ఎకరం స్థలాన్ని కేటాయించింది కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమం. ఇందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా కార్మిక సంక్షేమ అధికారి సురేంద్ర కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు చర్మ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అధికంగా ప్రభలే వీలుందని తెలిపారు. భవన నిర్మాణం సంక్షేమ మండలి, సీఎస్సీ హెల్త్ కేర్ ద్వారా 50 రకాల వైద్య పరీక్షలను కార్మికుల వద్దకు వచ్చి పరీక్షలు చేసి ఆరోగ్య కార్డును అందజేస్తారని చెప్పారు. అవసరమైతే దగ్గర్లోని ఆసుపత్రికి సిఫారసు చేస్తారని పేర్కొన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ సెంటర్ కామారెడ్డి లో మేషన్, ప్లంబర్, పెయింటర్, హౌస్ ఎలక్ట్రిషన్, టైలరింగ్ లలో శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను, కుట్టు మిషన్లను అందజేసినట్లు చెప్పారు. ఈ సంవత్సరం భవన నిర్మాణ కార్మికులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా 594 మందికి లబ్ధి చేకూర్చారన్నారు. న్యాక్ ద్వారా నైపుణ్య అభివృద్ధి కోసం 506 మంది తమ శిక్షణను పూర్తి చేసుకున్నారు.
సెట్విన్ ద్వారా భవన నిర్మాణం కార్మికుల పిల్లలకి సాంకేతిక విద్యను 90 రోజుల పాటు అందించినట్లు చెప్పారు. 800 మంది శిక్షణ పొందినట్లు ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో ఒక లక్ష 49 వేలకు పైగా అసంఘటిత కార్మికులు ఇస్రం పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలియజేశారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా బీడీ కార్మికులకు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులకు జీవనభృతిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి కమ్రుద్దీన్, న్యాక్ సెంటర్ ఇంచార్జ్ లింబాద్రి, సీఎస్సీ హెల్త్ కేర్ జిల్లా ఇంచార్జ్ శశికాంత్, ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.