- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనదారులు ఇలా చేయకపోతే..జైలు శిక్షే
దిశ ఆర్మూర్ : వాహనదారులు వారి వారి వాహనాలకు ఇన్సూరెన్స్ లను చేయించడంతో పాటు.. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లను తప్పకుండా చేయించాలని ఆర్మూర్ ఎంవిఐ వివేకానంద రెడ్డి తెలిపారు. వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండా మొదటి సారి పట్టుబడితే మూడు నెలల జైలు శిక్ష లేదా 2000 రూపాయల జరిమానా విధించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు వెల్లడించినట్లు తెలిపారు. రెండో సారీ వాహనాలకు ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే మూడు నెలల జైలు శిక్ష లేదా, 4 వేల రూపాయల జరిమానా విధించనున్నట్లు ఆర్మూర్ ఎంవి ఐ వివేకానంద రెడ్డి తెలిపారు. 1988 మోటార్ వెహికల్స్ ఆక్ట్ ప్రకారం.. వాహనదారులు తప్పకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో వారి కుటుంబ సభ్యులను గుర్తుంచుకొని వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు.. జరిమానాలు భారీగా విధించడానికి రవాణా శాఖ ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆర్మూర్ ఎంవిఐ వివేకానంద రెడ్డి తెలిపారు. ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ ప్రాంతంలోని ప్రజలందరూ వాహన చట్టాలను గుర్తించి..వాటికి అనుగుణంగా చట్టాలకు లోబడి వాహనాలను నడపాలన్నారు.