- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో నేనే నంబర్ వన్
దిశ, అంబర్ పేట్ : ఇంజనీరింగ్, పీజీ, మెడికల్ కాలేజీలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టింది తానేనని, తెలంగాణలో నంబర్ వన్ తానేనని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య భద్రత దినోత్సవంను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో మాట్లాడుతూ.. 1976లో పాలు అమ్ముకొని సాదాసీదా మనిషిగా బతికిన తాను కష్టపడి, క్రమశిక్షణతో మంత్రిగా ఎదిగానని చెప్పారు.
ఫ్యాక్టరీలు నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్తేనే సక్సెస్ అవుతాయని సూచించారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా నివారణకు వ్యాక్సిన్ తయారు చేసిన పరిశ్రమలు తెలంగాణలో ఉండడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను మరో ప్రపంచంగా తయారు చేశారని పేర్కొన్నారు. పరిశ్రమలలో కార్మికులకు సబ్సిడీ కింద క్యాంటీన్ భోజన సదుపాయాలతో పాటు యోగ, జిమ్ ఏర్పాటు చేయాలన్నారు. పరిశ్రమలలో ఉన్న పాత బాయిలర్స్ ను వెంటనే మార్చుకోవాలని సూచించారు. కార్మికుల ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. కార్యక్రమంలో లేబర్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ రాజగోపాల్ రావు, అధికారులు సదానంద గౌడ్, , శశి కుమార్, పీఎస్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read..
ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు డిప్రెషన్లో ఉన్నట్టే.. అవేంటో ఇక్కడ చూద్దాం
'దళితబంధు'లో అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి : ఎమ్మెల్యే ఈటల రాజేందర్