ఓటమి అంటే నాకు భయం లేదు

by Sridhar Babu |   ( Updated:2023-12-20 13:51:05.0  )
ఓటమి అంటే నాకు భయం లేదు
X

దిశ, నిజామాబాద్ రూరల్ : కార్యకర్తలకు, నాయకులకు, రూరల్ ప్రజలకు ఎల్లప్పుడూ తోడుంటానని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం నిజామాబాద్ మహాలక్ష్మి కాలనీలోని బాజిరెడ్డి గోవర్థన్ స్వగృహంలో ఏడు మండలాల ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గెలుపోటములు సహజమని, తాను ఓటమికి భయపడే నాయకుడిని కాదని అన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు వచ్చానని, ఎవరికీ తలవంచే వ్యక్తిని కాదని అన్నారు. తన వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి గెలిచిందని, ఆరు గ్యారంటీలు చూపించి ప్రజలను మోసం చేసిందని, ఆరు గ్యారెంటీలు అమలు చేయడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదని అన్నారు.

రూరల్ ను ఎంతో అభివృద్ధి పరిచానని తెలిపారు. 1100 మందికి దళిత బంధు ఇప్పించానన్నారు. 3 వేల గృహలక్ష్మి ఇండ్లు మంజూరు చేశానని తెలిపారు. రానున్న ఎలక్షన్ లో కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఓటమిపై మండల స్థాయి నాయకులు, కార్యకర్తల స్పందన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐడీసీఎం ఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, కొండాపూర్ సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ మండల స్థాయి క్యాడర్ మార్చాలని ఎవరు చెప్పినా మండల స్థాయి క్యాడర్ ప్రజల సమస్యలు వినిపించుకోలేదని తెలిపారు.

ప్రజలకి అందుబాటులో లేకపోవడం వల్లనే ఓటమికి కారణమైందన్నారు. ఎలక్షన్ సమయంలో గ్రామాల్లో తిరుగకుండా వారి పనుల కోసం మీ చుట్టూ తిరుగుతూ కాలయాపన చేశారన్నారు. కొందరు నాయకులు బీఆర్ఎస్ లో ఉంటూ కాంగ్రెస్ కు పని చేశారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు అనూష, సారిక, జెడ్పీటీసీ సుమలత, డైరెక్టర్ శ్రీనివాసరావు, సిద్ధులు నారాయణరెడ్డి, జక్రాన్ పల్లి ఎంపీపీ కుంచాల రాజు, డిచ్ పల్లి నాయకులు లక్ష్మి నారాయణ, రాము, సొసైటీ చైర్మన్ లు, పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ లు, నాయకులు పాల్గొన్నారు.


Read More..

తలకొండపల్లి ఎంపీపీ పై అవిశ్వాసం!?

Advertisement

Next Story