ఆర్మూర్‌లో ఘనంగా హోలీ వేడుకలు

by S Gopi |
ఆర్మూర్‌లో ఘనంగా హోలీ వేడుకలు
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్, అన్ని మండలాల్లో మంగళవారం హోలీ పర్వదిన వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. హోలీ వేడుకలు ఆర్మూర్ పట్టణంలోని గల్లీలు రంగుల మాయంగా మారాయి. రకరకాల రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ ఘనంగా జరిపారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సంతోషకరమైన వాతావరణంలో రంగులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. చిన్న పిల్లలు రంగు తుపాకీలతో తమ తోటి వారిపై రంగు నీళ్ళను పిచికారీ చేస్తూ కేరింతలు వేశారు. స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ బృందంగా తిరుగుతూ హోలీ రంగుల్లో తడిసి ముద్దయ్యారు. గల్లీ గల్లీలో రంగులు పులుముకుని, పిల్లలు ఆనంద ఉత్సవంగా జరుపుకున్నారు.

ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో హోలీ పండుగ పురస్కరించుకుని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ మిత్రులందరికీ పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నంలో కృత్రిమ మామూలు రంగులను ఒకరు ఒకరు పూసుకుని హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ మెప్మా ప్రతినిధులు సంబురంగా హోలీ సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుజరాతి నివేదన, దాచేపల్లి సంతోష్, బేల్దారి శ్రీనివాస్, డీకే అరవింద్, ఆకుల గంగాధర్, డీజే కిరణ్ గోవర్ధన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story