కామారెడ్డిలో దంచి కొట్టిన వర్షం

by Sridhar Babu |
కామారెడ్డిలో దంచి కొట్టిన వర్షం
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన జోరువాన కురిసింది. సుమారు గంట పాటు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి, రామారెడ్డి మండలం రెడ్డి పేట తదితర గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. కామారెడ్డి పట్టణంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. మురుగు కాలువలు పూర్తిగా వరద నీటితో నిండిపోవడంతో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. దీంతో ప్రజలు,

ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షానికి తోడు విద్యుత్ సరఫరాను సంబంధిత అధికారులు నిలిపివేయడంతో కారు చీకట్లు కమ్ముకున్నాయి. చీకట్లో రోడ్లపై నీరు ఉదృతంగా పారుతుండడంతో రోడ్లలో గుంతలు ఎక్కడ ఉన్నాయో, రోడ్డు ఎక్కడ ఉందో తెలియక పలువురు అవస్థలు పడ్డారు. కాగా కొద్దిసేపు వర్షం విరామం ఇచ్చి మళ్లీ మొదలైంది. కాగా కొంతమంది రైతులు వర్షంతో హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొంత మంది వరి పంట రైతులు చేతికొచ్చిన పంట రాలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story