వెనుకబడిన నియోజకవర్గం నుంచి వచ్చా

by Sridhar Babu |
వెనుకబడిన నియోజకవర్గం నుంచి వచ్చా
X

దిశ, ఎల్లారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గం ఎల్లారెడ్డి అని, అక్కడ ఎంతోమంది పేదలకు కూడు గూడు నీడ లేకుండా నివసిస్తున్నారని, ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్న నాథుడే లేడని బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున సమస్యలను వివరించారు. నియోజకవర్గంలో ప్రజలకు రెండు పడక గదుల ఇల్లు అందలేదని, మాటలకే పరిమితమైన భారాస ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ వచ్చిందని, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు చాలా గ్రామాలకు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు గ్రామపంచాయతీల్లో సర్పంచులు చేపట్టిన పనులకు సరిపడా బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. కమీషన్ల కోసం భారాస ప్రభుత్వం పాకులాడిందని, నష్టపోయిన సర్పంచుల ఉసురు ఆ పార్టీకి తగులుతుందని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతోమంది రైతులకు ధరణి పోర్టల్ ద్వారా అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రతి నెలా ఒకటో తారీకున జీతాలు వచ్చేవని, భారాసా ప్రభుత్వం పాలనలో 15 నుంచి 20వ తారీకు వరకు జీతాలు రాని పరిస్థితి నెలకొందని అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలను రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీ పథకాలను ప్రజలకు అంకితం చేశారని, త్వరలోనే మిగిలిన నాలుగు పథకాలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చి తీరుతుందని అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కాలేశ్వరం ప్రాజెక్టులో ఎంతో నష్టం చేకూర్చారని, ఆ అవకతవకలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీసి ప్రజలకు వివరిస్తారని తెలిపారు. 2014లో ఏఐసీసీ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే 10 సంవత్సరాల పాలనలో తెలంగాణను మొత్తం బ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారాస పార్టీ పాలనలో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వెలికి తీసి కఠిన చర్యలు చేపడుతుందని తెలిపారు.

Advertisement

Next Story