- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంకు ఎదుట అర్ధనగ్నంగా నిరసన
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని కెనరా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఓ బాధితుడు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసనకు దిగాడు. వినాయక్ నగర్ కు చెందిన జనార్ధన్ అనే వ్యక్తి కెనరా బ్యాంకులో తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం లోన్ తీసుకున్నాడు. తాను తీసుకున్న లోన్ కి సంబంధించిన రిటర్న్ పేమెంట్స్ కూడా క్రమం తప్పకుండా నందిపేట్ కు చెందిన నవీన్ అనే ఏజెంట్ ద్వారా చెల్లించారు. అయినప్పటికీ తన సిబిల్ స్కోర్ పడిపోవడాన్ని గమనించిన బాధితుడు జనార్ధన్ బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు.
వ్యక్తిగత లోన్ కు సంబంధించిన బాకీ పెండింగ్ లో ఉందని, లోన్ డబ్బులు సకాలంలో చెల్లించని కారణంగా సిబిల్ స్కోరు పడిపోయిందని బ్యాంకు అధికారులు తెలిపారు. కొత్తగా లోన్ ఇవ్వడం కుదరదని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఏజెంట్ నవీన్ ను జనార్ధన్ నిలదీశారు. లోన్ కు సంబంధించి ఇదివరకు చెల్లించిన డబ్బుల విషయమై నిలదీశారు. తాను చెల్లించిన లోన్ డబ్బుల విషయంపై సమాధానం చెప్పకపోగా, తననే బెదిరిస్తున్నాడని బాధితుడు వాపోయారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగి చెల్లిస్తానని పోలీసుల సమక్షంలో ఏజెంట్ నవీన్ ఒప్పందం రాసి ఇచ్చాడని, అయినా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని బాధితుడు వాపోయారు. ఏజెంట్ విషయంలో విచారించి చర్యలు తీసుకుంటామని బ్యాంక్ అధికారులు చెపుతున్నారు.