గ్రామపంచాయతీ వాటర్ ట్యాంక్ దొంగ అరెస్ట్

by Kalyani |
గ్రామపంచాయతీ వాటర్ ట్యాంక్ దొంగ అరెస్ట్
X

దిశ, తాడ్వాయి : సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే దురుద్దేశంతో గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ ని లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు..బిబిపేట మండలానికి చెందిన తంగేలపల్లి చాకలి రాజు గత రెండు సంవత్సరాల క్రితం స్వరాజ్ ట్రాక్టర్ కొనుగోలు చేసి అతని స్వగ్రామంలో దుక్కులు దున్నుకుంటూ ఉండేవాడని అన్నారు. అంతలోని చిట్యాల గ్రామానికి చెందిన రామచంద్రం పరిచయం కావడంతో అతను గ్రామంలో పని దొరుకుతుందని చెప్పడంతో అక్కడి నుంచి రాజు ట్రాక్టర్ తీసుకొని చిట్యాల గ్రామానికి చేరుకుని అదే గ్రామానికి చెందిన రమేష్ కు గత ఐదు నెలల క్రితం ట్రాక్టర్ ను లీజుకు ఇచ్చాడు.

లీజుకు తీసుకున్న రమేష్ దుక్కులు దున్నుకొని గ్రామ శివారులోని రైతు వేదిక వద్ద ట్రాక్టర్ను పెట్టాడు.అంతలోనే రాజు చిట్యాల గ్రామానికి వచ్చి ట్రాక్టర్లు తీసుకుని హైదరాబాద్ ఓ కంపనికి తీసుకెళ్లాడు. తాను చేసే కంపెనీలో వాటర్ ట్యాంకర్ అవసరం ఉందని దాంతో డబ్బులు సంపాదించవచ్చనే దురుద్దేశంతో అదే ట్రాక్టర్ తో కృష్ణాజివాడి గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకును దొంగిలించి తీసుకెళ్లాడు. దీంతో కేసు నమోదైన దొంగ ఆచూకీ లభించకపోవడంతో గ్రామపంచాయతీ వాటర్ ట్యాంక్ కావాలని గ్రామస్తులందరూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో పోలీసులు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

Next Story