- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోనస్ అందేదెప్పుడు !
దిశ, మాక్లూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరి ధాన్యానికి బోనస్ డబ్బులు అందే క్రమంలో నీలినీడలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే సగానికి పైగా వరి పంట కోతలు ముగిశాయి. కేంద్రాలు ఏర్పాటు చేసినా వరి కొనుగోళ్ల మాత్రం ప్రారంభం కాలేదు. హమాలీ కొరత, గన్ని సంచులు, రైస్ మిల్లర్లకు కేటాయింపు తదితర అంశాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరుగుతుంది. కేంద్రాల సమీపంలో వరి కుప్పలను రైతులు భారీగా నిల్వ చేశారు. ఒకపక్క వర్షాలు అన్నదాతలకు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇదంతా పసిగడుతున్న కొందరు దళారుల క్షేత్రస్థాయిలో రంగప్రవేశం చేశారు. స్థానికంగా ఉండే కొందరు వ్యక్తుల సహకారంతో రైతుల వద్ద ధాన్యాన్ని కొంటూ పక్కదారి పట్టిస్తున్నారు. మద్దతు ధర చెల్లించకుండా ధరలో వ్యత్యాసం, ధాన్యం తూకంలో తరుగు అంటూ అన్నదాతల వద్ద నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. మరికొంత మంది రైతులు ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. బోనస్ అందిస్తే తమకు కొంత ఆర్థిక అండ లభిస్తుందని కుప్పలుగా పోసి ఉంచారు. సన్నాలు, దొడ్లు అనే తేడా లేకుండా కొందరు రైతుల అవసరాలను గుర్తించిన దళారుల ధాన్యాన్ని ఇష్టారీతిన దండుకు పోతున్నారు. ఈ పరిణామల పై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.