రైతుల పాలిట శాపంగా మారిన ప్రభుత్వ విప్ వైఖరి

by Shiva |
రైతుల పాలిట శాపంగా మారిన ప్రభుత్వ విప్ వైఖరి
X

దిశ, కామారెడ్డి రూరల్ : భిక్కనూర్ మండలంలోని పూర్ణిమ రైస్ మిల్ లోకి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వెళ్లి అక్కడ పని చేసే వ్యక్తులపై, రైస్ మిల్ సిబ్బందిపై విచక్షణ కోల్పోయి చెయ్యి చేసుకోవడం అమానుషం అని, రైతుల మేలు కోరి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కామారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైస్ మిల్లర్ల మిల్లర్ల బంద్ కొనసాగితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ పరిణామాలు రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తాయన్నారు.

అకాల వర్షాలతో తీవ్రమైన పంట నష్టం కలిగి దుఃఖంలో ఉన్న రైతుల సమస్యల పరిష్కారంలో ముందు ఉండాల్సిన ఎమ్మెల్యే రౌడీల ప్రవర్తించడం శోచనీయమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా అధికారులను, మిల్లర్లకు సమన్వయం చేసుకుంటూ రైతులకు న్యాయం చేయాలంటూ హితవు పలికారు. తన ప్రవర్తనతో ఏ ఒక్క రైతు నష్టపోయినా రైతన్నల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. పరిస్థితి చేయి దాటక ముందే రైతుల శ్రేయస్సు కోరి వెంటనే మిల్లర్లకు క్షమాపణ చెప్పి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా ఇటువంటి చౌకబారు ఘటనలు భవిష్యత్తులో పునరావృతం చూసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed