ప్రభుత్వం అసైన్డ్ భూములకు సర్వ హక్కులు కల్పించాలి

by Sridhar Babu |
ప్రభుత్వం అసైన్డ్ భూములకు సర్వ హక్కులు కల్పించాలి
X

దిశ, బాన్సువాడ : తెలంగాణ ప్రభుత్వం అసైన్డ్ భూములను కలిగి ఉన్నవారికి సర్వహక్కులను కల్పించాలని టీఎస్ ఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షులు రుషేగాం భూమయ్య అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు భూమయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్రంలో డప్పు కొట్టేవారికి అంతేకాకుండా చెప్పలు కుట్టేవారికి నెలకు 5000 రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వాలని కోరారు. అసైన్మెంట్ భూములకు పట్టా పాస్ బుక్ లను అందించి, ఆ భూములపై సర్వహక్కులు కల్పించాలన్నారు.

బీజేపీ వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మోసం చేసిందని, ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాదిగల డిమాండ్ ను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు పురం ప్రభాకర్ మాదిగ, ఎర్రోళ్ల సంజీవులు మాదిగ, ఎర్ర లింగం మాదిగ, గుడ్డి కృష్ణ మాదిగ, ఉమ్మడి జిల్లాల గౌరవ అధ్యక్షులు కంతి పోచీరాం, నియోజకవర్గ ఇన్చార్జులు సింగం కాశీరాం, మండల అధ్యక్షులు జి. రాములు మాదిగ, మావురం సాయిలు మాదిగ, శంకర్ మాదిగ, రవీందర్ మాదిగ, మహిపాల్ మాదిగ, మైసారం మాదిగ ఎమ్మార్పీఎస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed