- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారం నిధులున్నాయని నమ్మించి మోసం..
దిశ, బాన్సువాడ : మీ ఇంటి ఆవరణలో బంగారం నిధులు ఉన్నాయని వాటిని వెలికి తీసిస్తామని స్నేహితుడిని, వారి కుటుంబ సభ్యులను నమ్మ బలిగించారు ముగ్గురు స్నేహితులు. బంగారు సూట్ కేసులు వస్తాయని చెప్పి పూజలు చేసి మూడు లక్షల 45 వేల రూపాయలు తీసుకొని మోసగించారు. ఆ తరువాత బాధితులు మోసపోయామని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఘటన వివరాల్లోకెళితే కామారెడ్డి జిల్లా బాన్సువాడ గాంధీ చౌక్ కు చెందిన అబ్దుల్ రెహమాన్ అలియాస్ మున్నాకు జావీద్, సోహెల్, లతీఫ్ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు.
అయితే ఆ ముగ్గురు మిత్రులు కూడా అబ్దుల్ రెహమాన్ ఇంటికి వచ్చి పోతూ ఉండేవారు. ఈ క్రమంలో అబ్దుల్ రెహమాన్ అలియాస్ మున్నా ఇంట్లో బంగారం వెలికి తీసిస్తామని 3 లక్షల 45 వేల రూపాయలు తీసుకొని గాంధీ చౌక్ లొ నివసిస్తున్న మున్న ఇంట్లో కొత్త సూట్ కేసు తెప్పించి క్షుద్ర పూజలు నిర్వహించారు. ఇలా నాలుగు ఐదు సార్లు పూజలు నిర్వహిస్తే తీసుకువచ్చిన సూట్ కేస్ లో బంగారం వస్తుందని నమ్మబలికించారు. ఇదంతా బూటకమని తెలుసుకుని మున్నా తల్లి పోలీస్ స్టేషన్ లొ ఫిర్యాదు చేసింది. విషయం బయటకు పొక్కడంతో స్థానికంగా కలకలం రేపింది. బాన్సువాడ ఎస్హెచ్ఓ మహేందర్ రెడ్డి కేసునమోదు దర్యాప్తు చేస్తున్నారు.