డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

by Sridhar Babu |
డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
X

దిశ, కామారెడ్డి : ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ కి సన్నద్ధమయ్యే షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రెండు మాసాల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఎడ్, బీఈడీ, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) అర్హత కలిగిన వంద మంది అభ్యర్థులకు ఏప్రిల్ 5 నుండి జూన్ 16 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వనున్నామని ఆమె తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.tsstudycircle.com.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed