బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో తనదే సింహభాగం..

by Sumithra |
బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో తనదే సింహభాగం..
X

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామ శ్రీ స్వయం భూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో తనదే సింహభాగం అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డితో పాటు పూజారులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకుల ప్రభాకర్ స్వామి చేత అభిషేకం జరిపించారు.

శివపార్వతుల కళ్యాణం తిలకించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మద్దికుంట గ్రామంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు బైక్ మీద వచ్చి చూసి చాలా సంతోషపడ్డానన్నారు. దేవునికి సేవ చేయాలని ఉద్దేశంతో దట్టమైన అడవి ప్రాంతంలో నక్సలైట్ ప్రాబల్య ప్రాంతంలో ఇక్కడ రోడ్డు, స్తంభాలు వేయించి బోరు మోటర్ సౌకర్యం, వసతి భవనాలు కట్టించానని తెలిపారు. ఆలయాన్ని అభివృద్ధి చేసిన విషయం మీ అందరికీ తెలిసిందేనని అన్నారు.

ఆలయ పున: నిర్మాణానికి ఆయనకు సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మహా శివరాత్రి వేడుకలో భాగంగా మాచారెడ్డి మండలం బండ రామేశ్వర పల్లి గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, కళ్యాణ మండపం నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed