- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధైర్యం కోల్పోవద్దు.. మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్
దిశ, భిక్కనూరు : మీరు పెద్దవారు... ధైర్యం కోల్పోవద్దు, గుండె నిబ్బరం చేసుకోవాలని, అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తానని మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డికి భరోసానిచ్చారు. ఆయన సతీమణి ఎడ్ల రాజమణి (75) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందారు.
ఈ మేరకు ఆమె అంత్యక్రియలు భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో మంగళవారం జరిగాయి. ఈ అంత్యక్రియలకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ హాజరయ్యారు. అనంతరం భార్య పార్థివ దేహం పక్కన కూర్చొని రోధిస్తున్నఎడ్ల రాజి రెడ్డిని చేరదీసి ఏడవకుండా ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మీరు అధైర్య పడితే కుటుంబ సభ్యులు ఆగమవుతారని, మీకు ఎటువంటి సహాయమైనా నేను చేస్తానని ఓదార్పు నిచ్చారు.
అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రంలో జరిగిన అంత్యక్రియలకు హాజరై చితి పై ఉన్న ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టెడి భగవంత రెడ్డి, గ్రామ సర్పంచ్ నాగర్తి పోతిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాగర్తి భూంరెడ్డి, వీడీసీ అధ్యక్షులు తక్కళ్ళ నర్సారెడ్డి, పాలకేంద్రం అధ్యక్షులు తక్కళ్ళ రవీందర్ రెడ్డి, రైతుబంధు సేవాసమితి డైరెక్టర్ తక్కళ్ల బాపురెడ్డి, ఇతర రాయకులు పార్టీలకతీతంగా అంత్యక్రియలకు హాజరయ్యారు.