- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి శ్రమ విద్యార్థులకు తెలుస్తుంది..
దిశ, నిజామాబాద్ సిటీ : తల్లి ఇంటి వద్ద పడే శ్రమను తెలియజేయడమే కాకుండా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నగర మేయర్ నీతు కిరణ్ అన్నారు. బుధవారం నగరంలోని విజయ్ హై స్కూల్లో నిర్వహించిన ఫుడ్ ఫీట్, క్రాఫ్ట్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ఎలాంటి జబ్బులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారని, సమతుల్యం లేని ఆహారంవల్ల తరచూ జబ్బులు వస్తాయని అన్నారు.
ఫుడ్ ఫీట్ లో ఆరోతరగతి విద్యార్థులు తయారుచేసిన స్వీట్లు, రైస్, జ్యూస్, మిర్చి, సమోసా, గప్ చుప్ వివిధ రకాల పిండి వంటలు ఆహార పదార్థాలను తిని ఆస్వాదించారు. 7వ తరగతి విద్యార్థులు అబ్బురపరిచేలా తయారు చేసిన క్రాఫ్ట్, క్లే వస్తువులను చూసి నచ్చిన క్లే, క్రాఫ్ట్ వస్తువును కొనుగోలు చేశారు. ఫుడ్ ఫెస్టివల్ తో పాటు వెజిటేబుల్ కార్వింగ్ లో కూరగాయలు, పండ్లు, జంతువులను, పక్షులను, పువ్వులతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తయారుచేసిన విధానాన్ని చూసి అభినందించారు. ఫుడ్ ఫీట్ కార్యక్రమంలో విజయ్ హై స్కూల్ కార్యదర్శి డాక్టర్ అమృతలత, కరస్పాండెంట్ వి ప్రభాదేవి, ప్రిన్సిపాల్ విజేత, టి. వసంత, సుజాత ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.