వలలో చిక్కుకొని జాలరి మృతి

by samatah |
వలలో చిక్కుకొని జాలరి మృతి
X

దిశ, మాచారెడ్డి: చేపల వేటకు వెళ్లిన జాలరి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చ పేట గ్రామ శివారులోని ఎగువ మానేరు బ్యాక్ వాటర్‌లో చోటు చేసుకుంది. లచ్చ పేట గ్రామానికి చెందిన బెస్త స్వామి(28) అనే జాలరి ఆదివారం చేపల వేటకు వల తీసుకొని వెళ్ళాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు బ్యాక్ వాటర్‌లో తెప్ప పై నిలబడి వల వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అదే వలలో చెక్కుకొని మృతి చెందినట్లు గా భావిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం చేపల వేటకు వెళ్లిన తమ కొడుకు రాకపోవడంతో సోమవారం ఉదయం ఆచూకీ కోసం వెతకగా అతని శవం వలలో చిక్కుకొని లభించింది. మృతునికి భార్య కూతురు ఉన్నారు. ‌ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు మాచారెడ్డి ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story