కలెక్టర్ కు నోటీసులు అందించిన చక్కర కర్మాగారం రైతులు..

by Sumithra |   ( Updated:2023-02-27 11:06:34.0  )
కలెక్టర్ కు నోటీసులు అందించిన చక్కర కర్మాగారం రైతులు..
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ సహకార చక్కర కర్మాగారం సారంగాపూర్ రైతు వాటాదారుల సర్వసభ్య సమావేశం నిర్వహించాలని సోమవారం చైర్మన్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు చెరుకు రైతుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు నోటీసులు అందజేశారు. ఈ సందర్బంగా రైతులు, వాటా దారులు మాట్లాడుతూ ప్రతిసంవత్సరం నిర్వహించవలసిన సర్వసభ్య సమావేశం గత 14 సంవత్సరాలుగా నిర్వహించనందున సహకార చట్టం బైలా నెంబర్ 28 (ఏ) ప్రకారం ఈ సంవత్సరం సర్వసభ్య సమావేశం జరుపుటకు చైర్మన్ అయినా జిల్లా కలెక్టర్ కు నోటీసులు అందజేశారు.

రైతులు సాయరెడ్డి, లక్ష్మారెడ్డి తెలిపారు. నోటీసులు ఇచ్చిన 28 లోపు సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని ఒకవేళ మార్చి 28వ తేదీలోపు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే మార్చ్ 29న ఉదయం 11 గంటలకు ఎన్ సీఎస్ఎఫ్ సారంగాపూర్ ఆవరణలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని అత్యధిక చెరుకు సరఫరా రైతులు, షేర్ హోల్డర్స్ తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో ఆకుల పాపయ్య, వెంకట్ రెడ్డి, బి.లక్ష్మా రెడ్డి రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story