నిజామాబాద్ జిల్లాకు కర్మాగారాలను తీసుకొస్తా : ఎంపీ Arvind Dharmapuri

by Nagaya |   ( Updated:2024-04-30 07:20:32.0  )
నిజామాబాద్ జిల్లాకు కర్మాగారాలను తీసుకొస్తా : ఎంపీ Arvind Dharmapuri
X

దిశ, నందిపేట్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల క్రితం ఇచ్చిన హామీలను ఏమీ నెరవేర్చలేదని మళ్లీ ఆ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రజలను కోరారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో తనను మరోసారి గెలిపిస్తే నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని, పసుపు బోర్డు సాధించినట్టే మరెన్నో శుద్ధి కర్మాగారాలను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం డొంకేశ్వర్ మండలంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ మాయమాటలు చెప్పే ప్రభుత్వం మనకొద్దన్నారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి జులై 14 వరకు మధ్యప్రదేశ్ కోర్టు గడువు ఇచ్చిందన్నారు. ఈసారి నాకు మళ్ళీ ఓటు వేసి ఆశీర్వదించి లోక్ సభకు పంపించగలరని ప్రజలను కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ధర్మపురి అరవింద్‌ను ఎంపీగా గెలిపించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని నియోజకవర్గ ప్రజలను కోరారు.

Next Story