క్రీడల్లో రాణిస్తే అనేక అవకాశాలు వస్తాయి

by Sridhar Babu |
క్రీడల్లో రాణిస్తే అనేక అవకాశాలు వస్తాయి
X

దిశ, బాల్కొండ : చదువుతోపాటు క్రీడలో రాణిస్తే అనేక అవకాశాలు వస్తాయని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి బాల్కొండ అంతర్ పాఠశాలల క్రీడల సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బాల్కొండ, ముప్కాల్,మెండోరా మండలాల విద్యార్థులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడలు కేవలం ఫిట్ నెస్ కోసమే కాదని, జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినపుడు వాటిని తట్టుకొని నిర్బయంగా మనో ధైర్యంగా ఉండటానికి ఉపయోగపడతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజం అని, అన్నింటిని సమానంగా తీసుకోవాలని కోరారు.

తల్లుదండ్రులు కూడా పిల్లలను చదువుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని సూచించారు. అంతకు ముందు పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడా మార్చ్ ఫాస్ట్ ను నిర్వహించారు. కేజీబీవీ ముప్కాల్ విద్యార్థినులకు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి ముప్కాల్ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల విద్యార్థులు గెలుచుకున్నారు. కార్యక్రమం లో వ్యాపార వేత్త దయానంద రెడ్డి, ఎంఈఓ రాజేశ్వర్, ఉపాధ్యాయ బృందం పెట్టు రాజకుమార్, మల్లేష్ ,సుమారు 30 ప్రవేట్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed