తగిలే పల్లిలో క్లోరో హైడ్రేట్ ను పట్టుకున్న అధికారులు

by Sumithra |
తగిలే పల్లిలో క్లోరో హైడ్రేట్ ను పట్టుకున్న అధికారులు
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని తగిలే పల్లి గ్రామంలో నిషేదిత క్లోరో హైడ్రేట్ ను పట్టుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ తెలిపారు. సోమవారం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ కు వర్ని మండలంలోని ఒక గ్రామంలో నిషేధిత క్లోరో హైడ్రేట్ నిల్వ ఉందని సమాచారం రావడంతో సీఐ వెంకటేష్ ఆధ్వర్యంలో టీం దాడులు చేసిందన్నారు.

తగిలేపల్లి గ్రామంలో కాయల రామాగౌడ్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించగా 9.4 కిలోల క్లోరో హైడ్రేట్ ను పట్టుకొన్నట్లు తెలిపారు. దాని విలువ 50 వేల వరకు ఉంటుందని అన్నారు. మహరాష్ట్రలోని బల్క్ డ్రగ్ కంపెనీల నుంచి క్లోరో హైడ్రేట్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి కల్తీ కల్లు తయారికి దానిని వాడే వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో రామాగౌడ్ ను అరెస్టు చేసి క్లొరో హైడ్రేట్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. నిషేధిత గంజాయి, డ్రగ్స్ ఎవ్వరు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ సీఐలు స్వప్న, వేంకటేశ్, హెడ్ కానిస్టేబుల్ నారాయణ రెడ్డి, కానిస్టేబుళ్లు హమీద్, శివ, బోజన్న, అవినాష్, విష్ణులు ఉన్నారు.

Advertisement

Next Story