ఆల్ఫాజోలుం రవాణా కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్..

by Vinod kumar |
ఆల్ఫాజోలుం రవాణా కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: హైద్రాబాద్‌లోని షాద్ నగర్ పోలిస్ స్టేషన్‌లో నమోదైన కేసు మూలాలు కామారెడ్డిలో కదులుతున్నాయి. షాద్ నగర్ పీఎస్ పరిధిలో పట్టుబడిన 30 కిలోల నిషేదిత అల్పజోలూం విలువ రూ. 3 కోట్లు ఉండటంతో నార్కోటిక్ డిపార్ట్ మెంట్ వారు ఈ కేసును ప్రతిష్టత్మకంగా తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో కామారెడ్డి ఎక్సైజ్ ఎస్‌హెచ్ఓ కార్యాలయంలో పని చేస్తున్న కానిస్టెబుల్ రమేష్ యాదవ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తుండటంతో కేసు తీగ అక్కడ లాగితే డోంక కామారెడ్డి ఎక్సైజ్ శాఖలో కదులుతుంది. కామారెడ్డి పట్టనానికి చెందిన ఓక కల్లు మూస్తేదారు, నాగిరెడ్డి పేట్ మండలంలోని ఓక గ్రామానికి చెందిన మరోకరిని నార్కోటిక్ డిపార్ట్ మెంట్ వారు అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో మరి కోందరి ప్రమేయాలు వెలుగు చూస్తున్నాయి.

ఈ నెల 23న వెలుగు చూసిన ఈ కేసులో ఓ ఎక్సైజ్ కానిస్టెబుల్‌ను నార్కోటిక్ డిపార్ట్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో జిల్లాలో పని చేస్తున్న మరో ముగ్గురు కానిస్టెబుళ్లు అజ్ఞాతంలోకి పోయారు. వారు గత మూడు రోజులుగా విధులకు రావడం లేదని సెల్ పోన్‌లు స్వీచ్ ఆఫ్ వస్తుండటంతో వారి ప్రమేయంపై అనుమానాలు ఎక్కువయ్యారు. కామారెడ్డి ఎక్సైజ్ కానిస్టెబుల్ రమేష్ యాదవ్‌తో సహచరులుగా ఉన్న మద్నూర్ మండలం సలబత్ పూర్ అంతరాష్ర్ట సరిహద్ధులోని ఎక్సైజ్ చెక్ పోస్టులో పని చేస్తున్న ఓ కానిస్టెబుల్, దోమ కోండ ఎస్‌హెచ్ఓ కార్యాలయం పరిధిలో పని చేస్తున్న మరోక్కరు, బిచ్కుంద సర్కిల్ పరిధిలో పని చేస్తు పనిష్మేంట్ క్రింద రాజన్న సిరిసిల్లా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టెబుళ్లు గత మూడు రోజులుగా కార్యాలయం ముఖం చూడలేదని, సెలవు కుడా పెట్ట లేదని, సెల్ పోన్‌లు స్వీచ్ ఆఫ్ వస్తుందని అధికారులు చెబుతున్నారు.

నలుగురు కానిస్టెబుళ్లు, మరికోంత మంది స్మగ్లర్లతో కలిసి కల్తీ కల్లు తయారిలో వాడే అల్పజోలుంతో పాటు గుడుంబా తయారిలో వాడే నల్లబెల్లం ఆక్రమ రవాణాలో అరితెరినట్లు తెలిసింది. ప్రధానంగా తెలంగాణ సరిహద్ధులోని మద్నూర్ మీదుగా మహరాష్ర్ట నుంచి నిషేదిత మత్తు పదార్థాలను ఈ మూఠా సరిహద్ధులు దాటిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రసాయినాలు కలిపిన మత్తు కల్లు నిత్యం లక్షల లీటర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. వారికి ప్రధానంగా కామారెడ్డికి చెందిన వ్యక్తులే సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.

అ నలుగురు అబ్కారి కానిస్టెబుళ్లు మహ ముదుర్లు..

నార్కోటిక్ డిపార్ట్ మెంట్ వారు కామారెడ్డి ఎక్సైజ్ కానిస్టెబుల్ రమేష్ యాదవ్‌ను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు పంపడంతో ఉమ్మడి జిల్లాలో అబ్కారి శాఖలో కొందరు కానిస్టెబుళ్ల తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా నలుగురు ఎక్సైజ్ శాఖ కానిస్టెబుళ్లు మత్తు పధార్థాలు సరఫరా, రవాణా చేసే వారితో చెతులు కలిపి ముఠాగా ఎర్పడి వాటిని సరిహద్ధులు దాటిస్తారని చెబుతున్నారు. వారు మత్తు పధార్థాల సరఫరాదారులతో కలిసి కోట్లకు పడగలేత్తారని సమాచారం. వారు రెండు దశాబ్ధాలకు పైగా కామారెడ్డి లోనే పని చేస్తు కల్తి కల్లు, గుడుంబా తయారిలో వాడే పదార్ధాలను రవాణా చేసేవారితో చెతులు కలిపి ముఠాగా ఎర్పడి వాటిని సరిహద్దులు దాటిస్తారని ప్రచారం జరగుతుంది. వారే ఒక వాహనంలో ముందుగా రెక్కి నిర్వహించి మరో వాహనంలో ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న ఐడీ కార్డులను చూపుతూ.. వాహనాలలో సరుకును సులువుగా హద్దులు దాటిస్తారని తెలిసింది.

గతంలో ఓక్కసారి బిక్కనూర్ టోల్ గేట్ వద్ధ ఓక్కసారి పట్టుబడ్డట్టు సమాచారం. సలబత్ పూర్ చెక్ పోస్టులో పని చేసే కానిస్టెబుల్, బిచ్కుంధ, దోమకోండ పని చేసే ముగ్గురు మహ ముదురులని అబ్కారి శాఖ అంతా కోడై కూస్తుంది. వీరి దందాల గురించి తెలిసి వారికి పోస్టింగ్ ఇవ్వాడానికి అధికారులు ఎవ్వరు ముందుకు రాలేదని తెలిసింది. గత ప్రభుత్వం హయంలోనే ఎక్సైజ్ మంత్రి, లోకల్ ఎమ్మెల్యే సిఫారసుతో స్థానికంగా ఉండిపోవాలని చేసిన ఎత్తులను అధికారులు చిత్తు చేసినట్లు తెలిసింది. బిచ్కుంధ లో పనిచేస్తున్న కానిస్టెబుల్‌ను పలు మార్లు హెచ్చరించిన తీరు మారకపోవడంతోనే పనిష్‌మెంట్‌తో రాజన్న సిరిసిల్లా జిల్లాకు బదిలీ చేసిన తీరు మారకుండా దందాలో కోనసాగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. తొలిసారి నార్కోటిక్ డిపార్ట్ మెంట్ వారికి చిక్కిన రమేష్ యాదవ్ తన సహచరుల పేర్లు వెల్లడించారని, అతని సెల్ పోన్ డాటా, దోరికిన మరోక ఇద్ధరు సెల్ పోన్ డాటా ద్వార వివరాలు సేకరించి ఈ దందాలో ఉన్నవారిని విచారించే అవకాశం ఉండటంతోనే ముగ్గురు కానిస్టెబుళ్లు కనిపించకుండా పోయారని చర్చ జరుగుతుంది. నార్కోటిక్ డిపార్ట్ మెంట్ రమేష్ యాదవ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడంతో అతనిపై సస్పెన్షన్ వేటు ఖాయం కాగా, మిగిలిన ముగ్గురిపై నార్కోటిక్ డిపార్ట్మంట్ వారు తీసుకునే చర్యల అధారంగా శాఖ పరమైన చర్యలు ఉంటాయని తెలుస్తుంది.

Advertisement

Next Story