ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందాలి

by Sridhar Babu |
ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందాలి
X

దిశ, నవీపేట్ : ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్దిదారునికి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు చర్యలు తీసుకోవాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మండల కేంద్రంలో మంగళవారం నాడు గృహ జ్యోతి కార్యక్రమం ప్రారంభించారు. ముందుగా జీరో కరెంట్ బిల్లు వచ్చిన ఇంటికి వెళ్లి గృహ జ్యోతి కార్యక్రమం లబ్ది పొందిన మహిళను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల లలో ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నారని తెలిపారు.

ముందుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తరువాత 500 కే గ్యాస్ సిలిండర్, ఇప్పుడు గృహ జ్యోతి లో భాగంగా 200 ల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ది పొందని వారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో లేదా గ్రామ కార్యదర్శి కి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేద ప్రజలు తమ ఆరోగ్యం కొరకు భూములు అమ్ముకొని వైద్యం చేసుకుంటున్నారని, ప్రైవేట్ వైద్యులు అధిక బిల్లులు వేసి పేద వారిని దోచుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రభుత్వం సూచించిన బిల్లులు మాత్రమే వేసి వైద్యం చేసేలా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వం లో ధరణి పేరిట భూములను దోచుకున్నారని, కానీ తమ ప్రభుత్వం ఈ నెల 9 తారీఖు లోగా ధరణి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ నాగనాథ్, విద్యుత్ అధికారులు సుహాసిని, ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, సాయ రెడ్డి, గోపాల్, భగవాన్, గోవర్ధన్ రెడ్డి, బుచ్చన్న, సురేష్, మోస్రా సాయన్న, బలరాజ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed