వంద రోజులు గడిచినా అమలు కానీ ఆరు గ్యారెంటీలు

by Disha Web Desk 15 |
వంద రోజులు గడిచినా అమలు కానీ ఆరు గ్యారెంటీలు
X

దిశ, ఎల్లారెడ్డి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చి ఎంతో అభివృద్ధి చెందవచ్చని భావిస్తే రాష్ట్రాన్ని ఒక వైపు అప్పుల పాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మరోవైపు 6 గ్యారంటీలు అని చెప్పి కాంగ్రెస్ నేతలు మోసం చేశారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. శనివారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచినా 6 గ్యారంటీ పథకాలు అమలు కాకపోవడంపై తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా

కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారని అన్నారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోరని అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున బేబీ పాటిల్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని, ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మూడోసారి ఏర్పడనుందని, నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార, నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారం పైలా కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed