కాకతీయ కాలువకు ఎస్సారెస్పీ నీటి విడుదల

by Sumithra |
కాకతీయ కాలువకు ఎస్సారెస్పీ నీటి విడుదల
X

దిశ, భీంగల్ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్సారెస్పీ జలవిద్యుత్ పత్తి కేంద్రం సీ.రమేష్ బాబు, ఎస్సీ శ్రీనివాస్ జెన్కోలో కాకతీయ కాలువ నీటి విడుదల చేశారు. స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన వారు మాట్లాడుతూ కాకతీయ వారాబంది ప్రకారం నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ఏడు తడుల పాటు నీటి విడుదలను చేస్తామన్నారు. కాలువ ద్వారా ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీరామ్ సార్ ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 90.313 టీఎంసీ కాగా 1088.60 అడుగులు 78.342 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు.

రిజర్వాయర్లో 12 టీఎంసీల నీరు తక్కువగా ఉందన్నారు. ఈ సీజన్లో యాసంగి పంటల కొరకు 60 టీఎంసీల నీటిని కేటాయించడం అన్నారు. కాకతీయ కాలువ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ నుండి 65 కిలోమీటర్ల (జోన్ 1) వరకు 3500 క్యూసెక్కుల నీటిని 7 రోజులు పాటు, కరీంనగర్ (జోన్ 2) వరకు 5,500 క్యూసెక్కుల నీటిని వారబంది ప్రకారం విడుదల చేస్తామన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ కు 5 టీఎంసీల నీటిని అడిగారన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ తాగునీటి కొరకు 6.5 టీఎంసీల నీటి అవసరం ఉంటుందన్నారు. రిజర్వాయర్ లో ఉన్న లిఫ్టులు కానీ సరస్వతి లక్ష్మీ కాలువలకు సరిపడే నీటి నిల్వ ఉందన్నారు. రైతులు ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకొని, ప్రాజెక్ట్ అధికారులు సహకరించాలన్నారు.

Advertisement

Next Story