- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవర్ హౌజ్ లో విద్యుత్ ఉద్యోగుల నిరసన
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పాండిచ్చేరిలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ నిరవధిక సమ్మెకు మద్దతుగా భారత దేశవ్యాప్తంగా సోమవారం బ్లాక్ డే నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ దిశ గా పాండిచ్చేరిలో టెండర్లు పిలవడంతో విద్యుత్ సంస్థ ఉద్యోగులు సమ్మెకు దిగారు. వారికి మద్దతుగా సోమవారం పవర్ హౌస్ కాంపౌండ్ లో విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఏ విధమైన పిలుపు ఇచ్చినా గాని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ సిద్ధంగా ఉండాలని జేఏసీ చైర్మన్ రఘునందన్ తెలిపారన్నారు.
మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పూర్తి మద్దతు తెలిపారని, మనమందరం కూడా ఒక్కతాటిపైకి వచ్చి దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకట్ రమణ, జేఏసీ చైర్మన్ రఘునందన్, కన్వీనర్ బాలేష్ కుమార్, జేఏసీ నాయకులు జి శ్రీనివాస్, తోట రాజశేఖర్, ఏ. కాశీనాథ్, శివాజీ గణేష్, పి గంగాధర్, గంగారాం నాయక్, బి .సురేష్ కుమార్, నాంపల్లి, మన్మోహన్, మోహన్ కుమార్ ,జాకీర్ అలీ, రాజేందర్, బల్లా శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీనివాస్, వీరేశం, 300 మంది ఉద్యోగులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.