నకిలీ ఓటరు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తొలగించాలి

by Naresh |
నకిలీ ఓటరు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తొలగించాలి
X

దిశ, నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా నకిలీ ఓటరు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తొలగించాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. ఆయన ఆదివారం నిజాంసాగర్ మండలంలోని గ్రామ పంచాయతీ బంజపల్లి పోలింగ్ బూత్ 248, 249 సుల్తాన్ నగర్ గ్రామంలో పోలింగ్ బూత్ 250 ఓటరు జాబితాను, ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ముందుగా బంజపల్లి గ్రామ పంచాయితీలో ఓటరు నమోదు కేంద్రం పరిశీలించి ఓటరు జాబితాలో కొత్తగా ఓటు హక్కు నమోదు, మార్పులు, చేర్పులు, చిరునామా మార్పులు, ఫారం 6, 8, 7లకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు తీసుకుంటున్న నియమ, నిబంధనలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన వారి కుటుంబీకుల ఆమోదంతో పేర్లను తొలగించాలని సూచించారు. బీఎల్ఓ సూపర్ వైజర్ పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిబద్ధతతో పని చేయకుంటే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనంతరం సుల్తాన్ నగర్ లో ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రం పరిశీలించి బీఎల్ఓ సూపర్ వైజర్ అశోక్ నిర్లక్ష్య వైఖరికి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు జాబితాలో కాలేజ్ సమయంలో తీసుకున్న ఫోటో ఇప్పటి వరకు కూడా చేంజ్ చేయకుండా అలాగే ఉండటంతో వారి ప్రస్తుత ఫొటో‌ను అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎన్ని ఓటరు పేర్లను తొలగించారు. ఎన్ని కొత్తగా ఓటరు జాబితాలో ఓటు హక్కు కల్పించేందుకు దరఖాస్తులను సేకరించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై బీఎల్ఓ సూపర్వైజర్ అశోక్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజు సాయంత్రం వరకు ప్రతి పేరును క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితమైన ఓటరు జాబితాను తప్పులు లేకుండా ఆన్ లైన్ చేయాలని మండల తహసీల్దార్ బిక్షపతికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బిక్షపతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంజయ్య,బి ఎల్‌ఓ అధికారులు డి. గంగారం, అంబయ్య, కారోబార్ సాయిలు, వివోఏ చాకలి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story