Uthonda : ఎత్తోండ సహకార సంఘంలో నాటకీయ పర్వం....

by Kalyani |
Uthonda : ఎత్తోండ సహకార సంఘంలో నాటకీయ పర్వం....
X

దిశ కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామ ప్రాథమిక వ్యవసాయం సహకార సంఘంలో నాటకీయ పర్వం చోటు చేసుకుంది. సహకార సంఘం చైర్మన్ అశోక్ పటేల్ తన చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహకార సంఘం ఆధ్వర్యంలో యాసంగి పంటను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి పంట డబ్బులు ఇవ్వడం లేదని గతంలో రైతులు సహకార సంఘానికి తాళం వేయగా తహసీల్దార్ సునీత, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రావు, రైతుల సహకార సంఘం సిబ్బందితో మాట్లాడి సద్దిచెప్పిన విషయం అందరికీ తెలిసినదే. రైతులు వడ్ల డబ్బులు విడతల వారిగా చెల్లించుకుంటూ వస్తూ ఇంకా రైతులకు కొన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉండగా చైర్మన్ రాజీనామా తెర పైకి రావడం గమనార్ధం. సహకార సంఘం సిబ్బంది కి చైర్మన్ కు మధ్య సమన్వయ లోపం, పరస్పర సహకారం లేకపోవడం వల్లే రాజీనామా చేసుండొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాజీనామా ఆమోదించాం - డి సి ఓ

చైర్మన్ రాజీనామా విషయంపై దిశ ప్రతినిధి డిసిఓ కు చరవాణి ద్వారా వివరాలు అడుగగా వ్యక్తిగత కారణాలవల్ల చైర్మన్ పదవికి, డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా పత్రంలో తెలపడంతో ఆయన రాజీనామాను ఆమోదించామని ఆయన తెలిపారు. తాత్కాలికంగా వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించామని, త్వరలో చైర్మన్ పదవి కోసం ఎన్నికల నిర్వహిస్తామని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed