దిశ కథనానికి స్పందన

by Javid Pasha |
దిశ కథనానికి స్పందన
X

దిశ, కామారెడ్డి రూరల్ : ‘‘ఆపన్న హస్తం కోసం గుండె వ్యాధి బాధితుడు ఎదురుచూపు’’ అనే కథనాన్ని దిశ ప్రచురించగా.. దీనికి దాతలు స్పందించి గంటల వ్యవధిలోనే సుమారు లక్ష రూపాయల వరకు విరాళాలు అందజేశారు. బాధితుడి ఆరోగ్య, ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ కథనాన్ని ప్రచురించగా దాతల మనసు కదిలించింది. దీంతో బాధతుడి స్వగ్రామానికి చెందిన మిత్రులు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతోపాటు పలువురు గూగుల్ పే ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

అంతేగాకుండా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మెసేజ్ లు చేశారు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు దిశకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు వచ్చిన విరాళాలు ఆపరేషన్ కు సరిపోవని మరింత సహాయాన్ని అందజేసి బాధితుడు రమేష్ ను రక్షించాలని కోరారు.

Advertisement

Next Story