దిశ ఎఫెక్ట్... రుద్రూర్ కేజీబీవీలో వసూళ్లపై విచారణకు ఆదేశం

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్... రుద్రూర్ కేజీబీవీలో వసూళ్లపై విచారణకు ఆదేశం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఫేర్ వెల్ పార్టీ పేరిట జరిగిన వసూళ్ల వ్యవహరంపై విచారణకు జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 20న దిశ దినపత్రికలో వచ్చిన కథనం మేరకు రుద్రూర్ కేజీబీవీలో జరిగిన ఫేర్ వెల్ పార్టీ పేరిట జరిగిన వసూళ్లపై విచారణకు వర్ని మండల విద్యాశాఖాధికారిని శాంతకుమారికి బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలిసింది. కేజీబీవీలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై గత కొంత కాలంగా ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవడంతో ప్రత్యేకాధికారుల అవినీతికి అంతు లేకుండా పోయింది.

ఏకంగా విద్యార్థినిల చేతనే పనులు చేయించే ప్రక్రియ కొనసాగుతుంది. బయట వ్యక్తులను కేజీబీవీలోకి తీసుకువచ్చి స్టాఫ్ తో పాటు విద్యార్థినిలను బెదిరించే ప్రక్రియ కొనసాగుతుంది. రుద్రూర్ కేజీబీవీలో ఫేర్ వెల్ పార్టీ పేరిట జరిగిన వసూళ్ల కార్యక్రమాన్ని కేజీబీవీ అధికారులు సమర్థించుకునే యత్నం చేయడం గమనార్హం. తల్లిదండ్రుల అనుమతితోనే వసూల్ చేశామని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వసూళ్లు చేసిన డబ్బులను మాత్రం ఖర్చు చేయకుండా పంచుకుని కేజీబీవీలకు ప్రతీ ఆదివారం సరఫరా చేసే చికెన్ ద్వారానే విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారా? లేక వారిని వెనుకేసుకోస్తారా? వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story