- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలి : మంద కృష్ణ మాదిగ
దిశ, నిజామాబాద్ సిటీ : వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచాలని కోరుతూ.. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట వీ.హెచ్.పీ.ఎస్ అధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. వికలాంగులు నిత్యం ఈ సమాజంలో వివక్షకు గురవుతున్నారని, వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు. ఆ హామీలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ కు మనసు రావడం లేదన్నారు.
రాష్ట్రంలో ఎమ్మెల్యేలు వారికి ఇష్టం వచ్చినట్లుగా జీతాలు పెంచుకుంటున్నారే తప్పా.. వికలాంగులకు పెంచాల్సిన పెన్షన్ పెంచేందుకు చేతులు రావడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు వారి మెనిఫెస్టోలో వికలాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇస్తామని అంశాని పొందుపరచాలన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కనక ప్రమోద్ మాదిగ, వీ.హెచ్.పీ.ఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు సుజాత సూర్య వంశీ, ఎం.ఎస్.పీ నిజామాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ డల్ల సురేష్ మాదిగ, ఎం.ఎస్.పీ జిల్లా సీనియర్ నాయకులు సరికెల్ల పోశెట్టి మాదిగ, తదితరులు పాల్గొన్నారు.