- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా..
by Sumithra |
X
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
చాలీచాలని వేతనాలు ఇస్తున్నారని, అవి కూడా సక్రమంగా చెల్లించక పోవడంతో తమ కుటుంబాలను పోషించుకోడం ఇబ్బందిగా ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. వెంటనే పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రమ్మ, పూజ, రఫిక్, జమున, స్వరూప, సునీత, షబానా, దయాకర్, శ్రీనివాస్, లావణ్య, జమున, రజిత, రాజేశ్వర్, ఫాతిమా, లక్ష్మీ, మమత, రజిత తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story