కలెక్టరేట్ ఎదుట కార్మికుల ధర్నా..

by Sumithra |
కలెక్టరేట్ ఎదుట కార్మికుల ధర్నా..
X

దిశ, కామారెడ్డి రూరల్ : గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి, కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, దీంతో వాళ్ళ కుటుంబాలు గడవక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని వారికి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.

అలాగే కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. అదేవిధంగా పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని, జీవో నంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు 26వేల రూపాయలు ఇవ్వాలని, గ్రామ పంచాయతీ వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీపీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, రాజనర్సు, సంఘం జిల్లా అధ్యక్షుడు బాలనర్సు, కార్యదర్శి సాయిలు, ఉపాధ్యక్షులు రాజన్న, శ్యాం, స్వామి, సిద్ది రాములు, నాయకులు నర్సింలు, సంతోష్, యాదగిరి, మణెమ్మ, యాదమ్మ, రాజు, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed