పేదలకు అండగా ధనపాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్..

by Sumithra |
పేదలకు అండగా ధనపాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నగరంలోని నిరుపేదల కోసం ధనపాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ 23 సంవత్సరాలుగా సేవాకార్యక్రమాలు చేస్తుందని ట్రస్ట్ చైర్మన్ ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రజలకు కష్టం ఉందని తెలియజేస్తే ఆ ట్రస్టు సభ్యులు అక్కడికి వచ్చి వారి ఇబ్బందులను తెలుసుకుని సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే నిరుపేదలకు ట్రస్ట్ ద్వారా 10లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్రారంభిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని మిర్చి కాంపౌండ్ లోని అర్బన్ కార్యాలయంలో ధన్పాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ ప్రారంభించారు. రేపటి నుంచి ఎవరైతే 25 మంది గ్రూపు సభ్యులతో తమ దృష్టికి తీసుకువస్తే నిరుపేదల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. కరోనా సమయంలో ప్రతి డివిజన్లో తమ ట్రస్ట్ సేవలు అందించిందన్నారు.

ఉచితంగా వాటర్ ట్యాంకులు, ఉచితంగా స్వర్గ రథ యాత్ర, కరోనా సమయంలో 4,000 పై చిలుకు నిత్యవసర కిట్లను అందజేశామన్నారు. ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకుంటూ పోతే దేవాలయాల అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని పురాతన ఆలయాల నిర్మాణం కోసం సాయ సహకారాలు అందిస్తున్నానన్నారు. ఎవరైనా పేదవారు వివాహం చేసుకుంటే సూరన్న పెళ్లి కానుక ద్వారా పూస్తే మట్టెలు, వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీద పిల్లలను ఉన్నత చదువుల కోసం ఒక 15 మంది విద్యార్థులను చదివిపిస్తున్నానన్నారు. పేదల కోసమే మా ట్రస్ట్ పనిచేస్తుందని బుధవారం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. తోలిరోజు 100 మందితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపి అసెంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, కార్పొరేటర్ సుక్క మధు, బీజేపీ నాయకులు వినోద్ రెడ్డి, ఇల్లెందుల ప్రభాకర్, రోషన్ లాల్ బోరా, ఆనంద్, మఠం పవన్, దాత్రిక రమేష్, శివునూరి భాస్కర్, అంత రెడ్డి హరీష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed